ఈరోజు నేను నిజాంపట్నం మండల సిపిఎస్ కన్వీనర్ డి. పూర్ణచందర్రావు స్థానిక రాజ్యసభ సభ్యులు మరియు బాపట్ల జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు మోపిదేవి వెంకట రమణారావు గారిని కలసి జీవో నెంబర్ 117 గురించి దాని పర్యవసానాలు ఒక ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థులకు కు రోజుకు 18 సబ్జెక్టులను బోధించాల్సి వస్తున్నదని తదితర విషయాలు సవివరంగా వివరించ గా ఆయన వెంటనే స్పందించి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారి తో ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది .అన్నా !నా ఒక్క రేపల్లె నియోజకవర్గం లోని 185 పైగా ఉపాధ్యాయ పోస్టులు సర్ ప్లస్ గా తేల్చడం జరిగింది, మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలలో ఇప్పుడున్న నిబంధనలతో వందలాది పోస్టులు సర్ ప్లస్ అవుతున్నాయి గా మరి? ఏం జరుగుతుంది ఈ విధంగా జరిగినట్లయితే స్థానికంగా ఉపాధ్యాయ వర్గం నుండి తల్లిదండ్రుల నుండి మనకు,పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. ఈ రేషనలైజేషన్ నిబంధనలు ఒక ఉన్నత విద్యాశాఖ అధికారి ఏకపక్షంగా నిబంధనలు రూపొందించినట్లు నా వద్ద సమాచారం ఉంది. ఆ అధికారి రూపొందించిన నిబంధనలను మీరు తప్పనిసరిగా మార్చాలి, ప్రస్తుత జీవో నెంబర్ 117 ప్రకారం రేషనలైజేషన్ జరిగినట్లయితే ఉపాధ్యాయ వర్గం నుండి మన పార్టీ సమస్యలు కొని తెచ్చుకొన్నట్లేనని తెలిపారు. అంతేగాక 3 ,4 ,5 తరగతుల హైస్కూల్లో కలపటం గురించి గడపగడపకు కార్యక్రమంలో పలువురు తల్లిదండ్రులు కలపవద్దని నాకు తెలియ పరచడం జరిగింది. ప్రైమరీ తరగతులను దయచేసి హై స్కూల్ కలప వద్దు. దీనివల్ల స్థానికంగా తల్లిదండ్రుల నుంచి మనం వ్యతిరేకత కొని తెచ్చుకుంటున్నాం అని మంత్రి బొత్సకు రాజ్యసభ సభ్యులు తెలియజేశారు. స్పందించిన బొత్స సత్యనారాయణ గారు నేను తప్పనిసరిగా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వారి తో మాట్లాడి జీవో నెంబర్ 117 లో సమస్యాత్మకంగా ఉన్నటువంటి అంశాలను తొలగించి ఉపాధ్యాయులకు మేలు చేసే విధంగా కృషి చేద్దామని మోపిదేవి గారికి ఫోన్ లో తెలియ పరచడం జరిగింది .వారిద్దరు మద్య 6నిమిషాలు పాటు ఫోన్లో GO 117 పై సంభాషణ జరిగింది. తదనంతరం మోపిదేవి గారు జీవో నంబర్ 117 లో మార్పులు జరగనట్లయితే వెంటనే నేను సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లి ఉపాధ్యాయులకు నష్టం జరగకుండా మార్పులు చేసేందుకు కృషి చేస్తానని మాకు తెలియ పరచడం జరిగింది.
COMMENTS