అసని తుపాను రేపు సాయంత్రంలోగా మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ సునంద తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. రేపు ఉమ్మడి తూ.గో., ప.గో., కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు తెలంగాణలో రాగల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.
COMMENTS