ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ వారు చేసిన సూచనలను అనుసరించి బంగాళాతం లో ఏర్పడిన అల్పపీడనము " అసని " తుఫానుగామారింది. రాగల 3 రోజులల్లో బలమైన ఈదురు గాలులతోను , తీవ్ర వర్షములు కురిసే పరిస్తితులు ఉన్నందున జిల్లాలోని అందరు జిల్లా అధికారులు , మండల స్థాయి అధికారులను , గ్రామ స్థాయిలో అధికారులు అందరూ అప్రమత్తం గా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి ఆదేశించారు. భీమవరం లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూము ఏర్పాటుచేయడం జరిగిందని,
కంట్రోల్ రూము నెంబరు 08816299189 . సబ్ కలెక్టర్ నరసాపురం, ఆర్ డి ఓ భీమవరం , అన్ని తాసిల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కంట్రోల్ రూమ్ లు 24 గంటలు పనిచేస్తాయని ,ప్రజలకు ఇబ్బంది జరిగిన ఈ కంట్రోల్ రూమ్ లకు సమాచారం అందించాలని ఆమె కోరారు. నరసాపురం లో NDRF team 20 మందిని అందుబాటులో ఉంచడం జరుగుతుందని , ఎక్కడైనా విపత్కర పరిస్థితులు ఎదురైయినట్లయితే ndrf బృందాలతోకలిసి పనిచేయాలని ఆమె సూచించారు. మండల ప్రత్యేక అధికారులు మండలాలకు వెళ్లి పరిస్థితులు సమీక్ష చేయాలని ఎటువంటి ఇబ్బంది జరిగినా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. అసని తుపాను పట్ల ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి కోరారు.
COMMENTS