జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులకు మరియు మండల విద్యాశాఖ అధికారులకు ముఖ్య విజ్ఞప్తి:: అసని తుఫాను కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలోని అందరూ ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక ,ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందరికీ పాఠశాలలో తగు జాగ్రత్తలు తీసుకొనవలసినదిగా ఆదేశములు జారీ చేయవలెను. శిథిలావస్థలో ఉన్న తరగతి గదులు, పెచ్చులు ఊడే slab లు మరియు గోడలు దగ్గర బాలబాలికలు ఆడుకొనుట మరియు విద్యాభ్యాసం చేయడం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకొన వలసిందిగా కోరడమైనది. పైన చెప్పిన విషయాన్ని వెంటనే సదరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మీ పాఠశాల పరిసర ప్రాంతాలను సందర్శించి బాల ,బాలికలకు మరియు గ్రామస్తులకు తెలియజేయవలెను. ఇట్లు జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రకాశం జిల్లా
COMMENTS