సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన "బంగారం"మందిరం. శ్రీకాకుళం :-సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు చేరిన ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రధం అసాని తుపాన్ ప్రభావంతో సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది.
అక్కడి ప్రజలు వీక్షించేందుకు ఎగపడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి సముద్రం రేవుకు ఎప్పుడు చూడని వింతైన రధం మంగళవారం కొట్టుకు వచ్చింది. ఈ రధమపై తేది 16-1-2022 అని విదేశీ బాష లో లిక్కించి ఉందని మలేషియా,థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది సీమెన్ లు అంటున్నారు. ఇంతవరకు తితిలి వంటి పెద్ద తుఫానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన మందిర రధం చూడలేదని తెలియజేస్తున్నారు.మేరైన్ పోలీసులు స్వాధీనం చేసున్నట్లు తెలిజేశారు..
COMMENTS