అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షలు అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. తుపాను వల్ల పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ పరీక్షను ఈ నెల 25 నుంచి నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అసని’ దిశ మార్చుకుంది. ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను.. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైపు దూసుకొస్తోంది. బుధవారం సాయంత్రలోగా మచిలీపట్నం సమీపంలో తుపాను తీరం దాటే సూచనలు ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది.
COMMENTS