పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తీవ్ర తుపాను 'అసాని' గత 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, బలహీనపడి తుపానుగా మారింది. ఇది రాబోయే కొద్ది గంటలలో దాదాపు వాయువ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది నెమ్మదిగా ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి మచిలీపట్నం, నర్సాపూర్, యానాం, కాకినాడ, తుని & విశాఖపట్నం తీరాల వెంబడి కదిలే అవకాశం ఉంది.
COMMENTS