సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుక్రవారం నాడు కీలక ప్రకటన చేసింది. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శని, ఆది వారాల్లో విఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర, శని, ఆదివారాలలో సిఫార్సు లేఖలపై కేటాయించే విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం జరిగింది. విఐపిల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే.. శుక్ర, శని, ఆదివారాలలో సర్వదర్శనం భక్తుల సౌకర్యార్దం అదనంగా దర్శన టోకన్లు జారి చేయనున్నట్లు సదరు ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే రోజుకు సర్వదర్శనం భక్తులకు 30 వేల టోకన్లు జారి చేస్తోంది టిటిడి. తాజాగా నిర్ణయంతో సర్వదర్శన భక్తులకు రోజుకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెరుగుతుంది.
COMMENTS