ఒకసారి జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయడం సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు . ఏదీ అడగకుండానే సీఎం జగన్ ఇచ్చారని చెప్పారు . అమరావతిలో మంత్రులు బొత్స సత్యనారాయణ , పేర్ని నానితో కలిసి సజ్జల మీడియాతో మాట్లాడారు.నిన్నటిలాగే మంత్రుల కమిటీ నేడు కూడా ఎదురుచూసిందని ఆయన చెప్పారు . ఉద్యోగ సంఘాల నేతలు ఆలస్యంగా వచ్చినా వేచి చూశామన్నారు . స్టీరింగ్ కమిటీ నేతలు వచ్చి కలిశారని .. పీఆర్సీ జీవోలు నిలుపుదల చేయాలని కోరారన్నారు . ఇంతకాలం చేసిన ప్రక్రియను తిరగతోడటం సరికాదని .. ఏమైనా మార్పులు ఉంటే వాటి గురించి మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పారు . ఈనెల 27 న మళ్లీ చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరినట్లు సజ్జల తెలిపారు .
COMMENTS