పీ ఆర్ సి నివేదిక విడుదల చేయాలంటూ సచివాలయంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు.. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసే వరకు ఇక్కడి నుంచి కదలబోమంటూ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.. సీఎంను కలిసి సీఎస్ చర్చించిన తర్వాత నివేదిక విడుదల చేస్తారని భావించినా ఉద్యోగ సంఘాలకు నిరాశ ఎదురైంది.. అయితే, పీఆర్సీ ప్రక్రియ ప్రారభమైందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.. మరోవైపు రేపు పీఆర్సీపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎందుకంటే.. *రేపు మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కానుంది*… ఉద్యోగ సంఘాల ఆందోళనతో మళ్లీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. పీఆర్సీ నివేదిక అందజేత, ఫిట్మెంట్, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో ప్రభుత్వం చర్చించనుంది.
COMMENTS