ఇక జేఏసీల ప్రధాన డిమాండ్లలో పీఆర్సీ, సీపీఎస్ రద్దు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంపు, పెండింగ్లో ఉన్న బకాయి లు, పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం తదితర అంశాలు ఉన్నాయి. వీటిలో కూడా ప్రధానంగా వేతన సవరణకే పట్టుపడుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీజేఏసీ, జేఏసీ- అమరావతి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్ప రాజు వెంకటేశ్వర్లు తదితర నేతలు శుక్రవారం సచివాల యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ గారితో మరోసారి భేటీ అయ్యారు. పీఆర్సీ నివేదికను అందించా లని విజ్ఞప్తి చేశారు.
COMMENTS