పిఆర్సి నివేదికను తక్షణం బయట పెట్టేది లేదని, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు విభాగం కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పేర్కొన్నారు. సచివాలయంలో బుధవారం ఆందోళన నిర్వహించిన ఏపీ ఎన్జీవో నాయకులు, అమరావతి జేఏసీ నాయకులను ఆయన గురువారం పిలిచి మాట్లాడారు. పీఆర్సీ నివేదిక విషయంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తమకు చెప్పినట్లు ఉద్యోగ సంఘ నేతలు మీడియాకు వెల్లడించారు. శశి భూషణ్ కుమార్ తో సమావేశం అనంతరం ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు, అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పిఆర్సి నివేదికను ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదో తమకు తెలియడం లేదన్నారు. అసలు పిఆర్సి అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అని వారు ప్రశ్నించారు.
COMMENTS