ముఖ్యమంత్రి గారి పరిశీలన పూర్తయిన తరువాత ఈనెల 8వ తేదీన పీఆర్సీ నకలు కాపీ లను ఉద్యోగ సంఘాలకు పంపుతామని సీఎస్ గారు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఫిట్మెంట్ కు, ఐఆర్కు ఉన్న వ్యత్యాసాన్ని బేరీజు వేసుకున్న తరువాత తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లు జేఏసీల నేతలు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు 30 శాతం హెచ్ఐర్ఎ, స్థానికులకు 20 శాతం అమలు చేస్తోంది. తెలంగాణలో హెచ్ఎర్ఎ తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంపై కూడా ఆ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ప్రకటించే పీఆర్సీ ఏ రకంగా ఉంటుందనేది ఉత్కంఠభరితంగా మారింది.
COMMENTS