ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ నివేదిక ను పూర్తిగా మూడు రోజుల్లో బయట పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. వెలగపూడి సచివాలయం లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఆర్సీ నివేదిక బయట పెడితేనే సమావేశంలో ఉంటామని లేకుంటే బహిష్కరిస్తామని ప్రకటించారు. సమావేశం అయిన తర్వాత నివేదిక వెల్లడిస్తామని చెప్పిన సి ఎస్ మూడు రోజుల్లో పూర్తి పిఆర్సి నివేదిక బయటపెడతామని స్పష్టంగా ప్రకటించారు.
COMMENTS