" పిఆర్సి పై 27 శాతం ఫిట్మెంట్ తో ఒక నోట్ మాత్రమే ఇచ్చారు. అంతకుమించి ఎలాంటి స్పష్టత లేదు. వారం రోజుల్లో కమిటీ వేస్తామన్నారు." అని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. పెన్షన్లు జీతాల పై కూడా ఇలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగు లకు రావలసిన బకాయిలు పై కూడా ఇలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. ఈ సమావేశం పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలపై కార్యదర్శులతో వచ్చేనెల 30 లోపు సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారని బొప్పరాజు వివరించారు. కారుణ్య నియామకాల విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని సీఎస్ కు చెప్పామన్నారు. వారం రోజుల్లో పిఆర్సి పై స్పష్టత రాకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెల్లడించారు.
COMMENTS