ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరగనుంది. ఈ సమావేశంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలి అనే అంశంపై కొద్దిసేపటి క్రితం ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో జేఏసి విజయవాడలో సమావేశమయింది. పీఆర్సీ నివేదిక బయటపెట్టి తక్షణమే అమలు ప్రక్రియ ప్రారంభించాలని గట్టిగా డిమాండ్ చేయాలని వీరు నిర్ణయించారు. తొలుత పిఆర్సి పైనే పట్టు పట్టాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. పీఆర్సీ నివేదిక వెంటనే బయటపెట్టాలని తొలుత వీరు డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకుంటే గట్టి నిర్ణయం తీసుకోవాలని నిశ్చయానికి వచ్చారు. పీఆర్సీ నివేదిక బయట పెట్టకపోతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం బహిష్కరించి బయటకు వచ్చేందుకు వెన కాడ వద్దని నిర్ణయించుకున్నారు. అమరావతి జేఏసీ సైతం వీరితో కలిసి వెళుతున్నందున వారు కూడా ఇదే వ్యూహానికి మద్దతు పలకనున్నారు. అక్కడి పరిస్థితులకు అనుకూలంగా ఈ వ్యూహం అమలు చేయాలని రెండు జేఏసీలు నిర్ణయించాయి. ఈ వ్యూహం మేరకే సమావేశం ప్రారంభమైన వెంటనే బండి శ్రీనివాసరావు పిఆర్సి నివేదిక కోసం పట్టుబట్టారు.
COMMENTS