ఉద్యోగుల సంక్షేమం, వారి భధ్రత విషయంలో తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని, వారి విషయాన్ని బాధ్యతగా భావిస్తున్నామని…వారి విషయంలో రెండు అడుగులు ముందే సీఎం జగన్ ఉంటారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కృష్ణారెడ్డి వెల్లడించారు. జీతాలు ఆలస్యం కాకుండా చూస్తామని చెప్పిన ఆయన..ఈనెలాఖరులోగా పీఆర్సీ క్లియర్ చేస్తామన్నారు. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా…ఆర్థిక పరిస్థితి బాగాలేక..కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమేనని, ఈ వత్తిడి వల్ల ఉద్యోగుల చిన్న చిన్న సమస్యలు పెద్దయ్యాయని తెలిపారు.
COMMENTS