ఉద్యోగులు చిరకాలం గుర్తుంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం 11వ వేతన సవరణను వెంటనే అమలు చేయాలని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వైవీ రావు డిమాండు చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై సీఎం జగన్ వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం ప్రకటిస్తారనే విశ్వాసం తమకుందని పేర్కొన్నారు. కొత్త పీఆర్‌సీ కోసం పోరాడాల్సిన ఉద్యోగ సంఘాలు పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతోందని, ఉద్యోగుల హక్కులను సాధించడంలో ఏపీ ఐకాస అమరావతి ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.
COMMENTS