ఆనందయ్య కరోనా మందు తయారీ కంపెనీ పై నెల్లూరు కలెక్టర్ సమీక్ష సమావేశం ముగిసింది. రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూనే కృష్ణపట్నంలోనూ అమలు అవుతుందని కలెక్టర్ చక్రధర్ బాబు స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి కృష్ణపట్నంకి వస్తే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఆనందయ్య కరోనా మందు కావాలనుకుంటున్న బయట వ్యక్తుల కోసం కాల్ సెంటర్, ప్రత్యేకమైన ఓ యాప్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. యాప్ ద్వారా కరోనా మందుని బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మందు తయారీ ప్రాంతాన్ని రెవెన్యూ పోలీసు శాఖలు గుర్తిస్తాయని చెప్పారు.
COMMENTS