అసలు ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా? అసలు ఆనందయ్య ఏదైనా ఆయుర్వేద కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారా? ఆనందయ్య ఇస్తున్న మందు ఆయుర్వేదం కాదు. ఆయుర్వేదం అని కన్ఫ్యూజ్ చేయకండి ఆయన కేవలం చెట్ల మూలికలు వాడినంత మాత్రాన ఆయుర్వేదం కాదు.. ఎప్పటికీ ఆయుర్వేదం కాదు. చివరగా ఆనందయ్య మందుని సపోర్ట్ చేస్తున్న వాళ్లకు ఒకటే సూటి ప్రశ్న. మీకు కరోనా వచ్చి ప్రాణం మీదకు వస్తే దగ్గరలో ఉన్న అల్లోపతి ఆసుపత్రికి వెళతారా? ఆనందయ్య మందు తిన్నాం కదా.. అని ధైర్యంగా కూర్చుంటారా? మీ గుండెపై చెయ్యి వేసుకొని నిజంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని వి.రజనీకాంత్, TV9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ వ్యాసం ప్రచురించారు
COMMENTS