ఆనందయ్య కరోనా మందును పేదలకు పంపిణీ చేయాలంటే ఆయుష్ క్లియరెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు కావాలంటూ అడ్డుకుంటున్నారు.. ఎమ్మెల్యే తన బంధుమిత్రులు, వ్యాపారస్తులకు ఇచ్చేందుకు మాత్రం ఈ అనుమతులు అవసరం లేదా…? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆనందయ్యకు భద్రత కల్పిస్తున్నామని బయటకు చెబుతూ ఆయనను నిర్బంధంలో ఉంచుకుని వేలాది మందికి మందు తయారు చేయించుకుంటారా.. అంటూ ఆయన ప్రశ్నించారు.
COMMENTS