కరోనా కష్టకాలంలో దొరకిన ఒక దివ్యాస్త్రంలా ఆనందయ్య కరోనా మందుపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని వాడుతుంటుంటే, బాబు గోగినేని మాత్రం ఒక రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. “పసరుతో ఆక్సిజన్ పెరగడమా.! ఇప్పుడేమైంది? హౌలేగాళ్లలారా..” అంటూ బాబు గోగినేని ఇటీవల తీవ్ర వ్యాఖ్యలకు దిగిన సంగతి తెలిసిందే. కళ్లలో మందు వేయగానే తేరుకున్నానని చెప్పిన రిటైర్డ్ హెడ్మాస్టర్ పరిస్థితి ఇప్పుడు మరింత అధ్వానంగా తయారైందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లలో పసరు వేస్తే రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి?, ఆనందయ్య దుకాణం వెంటనే మూయించాలంటూ డిమాండ్ చేసిన బాబు గోగినేని ఇప్పుడు మళ్లీ “సస్తారురా ఒరేయ్!” అంటూ.. ఆనందయ్య మందుకు సంబంధించి చాట భారతమంత పోస్ట్ పెట్టారు.
COMMENTS