కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉంది. ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చాయి. సీసీఆర్‌ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని నివేదికలు పేర్కొన్నాయి. ఆనందయ్య మందు వాడితే కొవిడ్ తగ్గుతుందనడానికి నిర్ధారణలు లేవని నివేదికలు పేర్కొన్నాయి. కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉందని ఆయుష్ కమిషనర్ సీఎంకు చెప్పారు. నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.
COMMENTS