ఈ మందుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైందని, సోమవారం విచారణ జరగనుందని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఇప్పటికే మందుకు సంబంధించిన పలు నివేదికలు వచ్చాయని, శనివారం తుది నివేదిక వస్తుందని ఆయన తెలిపారు. నివేదికలను అధ్యయన కమిటీ చూసి మరోసారి పరిశీలిస్తుందని చెప్పారు. డ్రగ్స్ లైసెన్స్ విషయంలో కూడా కమిటీ అధ్యయనం చేస్తోందని, కేంద్ర సంస్థ అధ్యయన కమిటీ నివేదిక శనివారం వచ్చే అవకాశం ఉందన్నారు.
COMMENTS