మందు పంపిణీ పక్రియలో పనిచేసిన వారందరికీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా టెస్ట్ నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నెల ముగిసే కొద్దీ కరోనా పాజిటివ్ కేసులు ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో గ్రామ పరిస్థితి ఏమవుతుందో అని గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కచ్చితంగా అధికారులు రాపిడ్ టెస్ట్ నిర్వహించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి పది రోజుల క్రితం స్థానికంగా జరిగిన ఆనందయ్య మందులు పంపిణీ ఈ ప్రక్రియలో కరోనా పాజిటివ్ రోగులకు కంటిలో డ్రాప్స్ వేసి సేవా కార్యక్రమం చేసినట్లు తెలిసింది.
COMMENTS