ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టాను సారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని ప్రభుత్వ తెలిపింది. ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్ పాజిటివ్ రోగులు రాకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రోగులకు బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్తే.. కోవిడ్ విస్తరించే ప్రమాదం తప్పుతుందని సూచించింది.
COMMENTS