ఆయుష్ కమిషనర్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో అనందయ్య తయారుచేస్తున్న మందు పంపిణీకి అభ్యంతరం లేదని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. మందు లో ఉపయోగిస్తున్న పదార్థాలతో హాని లేనట్లు వెల్లడైందని చెప్పారు. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చాక తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. అయితే ఆయుర్వేద మందుగా దీన్ని గుర్తించడం లేదని, అలా చేయాలంటే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం శాస్త్రీయతపై నిర్ధారణ, ఇతర అనుమతులు అవసరమవుతాయని ఆయన వివరించారు.
COMMENTS