ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతిచెందారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. పదిరోజుల క్రితం కరోనాతో కోటయ్య.. నెల్లూరు జీజీహెచ్‌లో చేరారు. కరోనా సోకిన తర్వాత కోటయ్య.. తొలుత కృష్ణపట్నం ఆనందయ్య మందు తీసుకున్నారు. అనంతరం తాను కోలుకున్నట్టు కోటయ్య ఓ వీడియోలో చెప్పారు. దీంతో ఆనందయ్య మందు గురించి చాలా మందికి తెలిసింది. ఆ తర్వాత ఆనందయ్య మందుకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. చాలా మంది ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నానికి బారులు తీరారు. దీంతో దేశవ్యాప్తంగా ఆనందయ్య మందుపై చర్చ మొదలైంది. అయితే ఆనందయ్య మందు తీసుకన్న రెండు రోజుల అనంతరం ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో కోటయ్య.. ఆస్పత్రిలో చేరారు.
COMMENTS