ఆనందయ్య వద్ద చికిత్స పొందిన సుమారు 500 మందిని నుంచి సేకరించే సమాచారంతో తొలుత జంతువులు, ఆ తరువాత మానవులపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి. ఆ తరవాతే ఆనందయ్య వైద్యం ఆయుర్వేద ప్రమాణాలకు తగ్గట్లుగా ఉందా లేదా అన్నది కేంద్ర ఆయుర్వేద సంస్థ నిర్ధారిస్తుందని వైద్యులు వెల్లడించారు. యుద్ధ ప్రాతిపాదికన పరిశోధనలు జరిగితే ఫలితాలు వచ్చేందుకు కనీసం 2,3 నెలలు పడుతుందని సమాచారం. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ అధ్యయనానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి చొరవతో కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ వెంటనే రంగంలోకి దిగింది.
COMMENTS