ఆనందయ్య మందుపై కేంద్ర ఆయుష్ సంస్థతో కలిసి టీటీడీ ఆయుర్వేద కళాశాల ఆధ్యయనం చేయనుందని టీటీడీ చైర్మన్ వెల్లడించారు. సీసీఆర్ఏఎస్, టీటీడీ ఆయుర్వేద కళాశాల అధ్యయనం తరువాత క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బట్టి ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతి ఇస్తుందని తెలిపారు. ఐదారు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
COMMENTS