నెల్లూరు (జి)-కృష్ణపట్నం నుంచి ఆనందయ్యను తెల్లవారుజామున ప్రత్యేక పోలీసు బందోబస్తుతో రహస్య ప్రాంతానికి తరలించారు. ఆనందయ్య కరోనా ఔషధం పంపిణీ అంశంపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఇతరప్రాంతాల ప్రజలను కృష్ణపట్నం అనుమతించడం లేదు. నెల్లూరు, ముత్తుకూరు రహదారుల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాటు చేశారు. కాగా ఈ ఔషధంపై ఆయుష్ శాఖ నేడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆనందయ్య ఆశిస్తున్నారు.
COMMENTS