కరోనా కట్టడి కోసం ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుపై ఆయుష్ పరిశోన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయుష్ కమిషనర్ రాములు ఆనందయ్య మందుపై నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. ‘‘ఆనందయ్య మందు ద్వారా ఎలాంటి ప్రమాదం లేదు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రజలకు పంపిణీ చేయవచ్చు. మూడు, నాలుగు రోజుల తర్వాత నివేదక వస్తుంది. సీసీఆర్‌ఏఎస్ నివేదక వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది’’ అని తెలిపారు.
COMMENTS