ఆనందయ్య కరోనా మందు కోసం తయారు చేసిన ఆయుర్వేద మందుపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ స్పందించారు. ఆనందయ్య తయారు చేసిన మందును కొట్టిపారేశారు. ప్రజలు మూఢ నమ్మకాలు నమ్మొద్దని సూచించారు. కరోనా సమయంలో వైద్యులు సూచించిన మందులే వాడాలని సూచించారు. ఆనందయ్య మందు వాడి జగిత్యాల వాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కరోనాతో జనాలు బతుకుతున్నది డాక్టర్ల మెడిసిన్ వాడటం వల్లేనని సంజయ్ పేర్కొన్నారు. ఆనందయ్య మందు వల్ల జనం బాగుపడితే పాదాభివందనం చేస్తానని ప్రకటించారు. ఆనందయ్య మందుకు పబ్లిసిటీ ఇవ్వొద్దని సంజయ్ సూచించారు. జగిత్యాల ప్రభుత్వాస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే మాట్లాడారు.
COMMENTS