ప్రస్తుతం ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతిలోని ఆయుర్వేద కళాశాలలో పరిశోధన కొనసాగుతోంది. కృష్ణపట్నంలో ఆనందయ్య దగ్గర మెడిసిన్ తీసుకున్న వారికి ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు వైద్యలు. నిన్నటి రోజున 190 మందికి ఫోన్ చేసి వివరాలు సేకరించారు. కరోనా వచ్చి మందు తీసుకున్న వారు కనీసం 500 మందిని విశ్లేషిస్తేనే మందు ప్రభావంపై ప్రాథమిక నిర్ధారణ చేయవచ్చని అంటున్నారు.
COMMENTS