వైద్యులు, పీజీ విద్యార్థులు 32 బృందాలుగా ఏర్పడ్డారని ఆయుర్వేద వైద్యకళాశాల ప్రిన్సిపాల్ పి.మురళీకృష్ణ తెలిపారు. వీరు ఆనందయ్య వద్ద చికిత్స పొందిన వారికి ఫోన్లు చేసి వారికి కరోనా ఎప్పుడు వచ్చింది, ఆ సమయంలో ఆర్టీపీసీఆర్, సీటీ స్కాన్ పరీక్షలు చేయించుకున్నారా అనే వివరాలు తీసుకుంటున్నారు. కొవిడ్ వచ్చినట్లు తెలిసిన తర్వాత ఎన్ని రోజులకు ఆనందయ్య వద్ద మందులు తీసుకున్నారు, ఎప్పుడు ఉపశమనం కలిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇలా అన్ని కోణాల్లోనూ వివరాలు సేకరిస్తున్నారు. ఆ తరవాత ఈ సమాచారాన్ని క్రోడీకరించి తయారు చేసిన నివేదికను పరిశోధనసంస్థకు పంపుతారు.
COMMENTS